: చంద్రబాబుకు శుభాకాంక్షలు: పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలిపారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబునాయుడి పరిపాలనా దక్షత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. బీజేపీ సహకారం వల్లే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చిందని ఆమె తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.