: నాకు మంత్రి పదవి ఇస్తే అది పరిటాల రవికి ఇచ్చినట్టే: సునీత
తనకు మంత్రి పదవి ఇస్తే అది దివంగత టీడీపీ నేత పరిటాల రవికి ఇచ్చినట్టేనని ఆయన భార్య సునీత తెలిపారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, పరిటాల రవి హత్యకేసును తిరగదోడుతామని అన్నారు. పరిటాల హంతకులకు శిక్ష పడేవరకు విశ్రమించేది లేదని ఆమె స్పష్టం చేశారు. పరిటాల హత్య వెనుక జగన్ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.