: డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇచ్చే విషయమై చర్చ: వెంకయ్య
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చే విషయమై చర్చిస్తున్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రతిపక్షాలకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలన్నదేే తమ విధానంగా పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి ఇవ్వాలన్నది స్పీకర్ నిర్ణయమని చెప్పారు. రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. దానిపై చర్చ అనంతరం ఉభయ సభల్లోనూ ప్రధాని దానికి బదులిస్తారని తెలిపారు.