: రుణమాఫీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: హరీష్ రావు
రైతు రుణమాఫీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని పార్టీలు రైతులకు ధైర్యం చెప్పాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో అవసరమైన చోట రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.