: పారిశ్రామిక వేత్తల నుంచి 10 వేల కోట్ల పెట్టుబడులపై బాబు హామీ తీసుకున్నారు: లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పారిశ్రామిక వేత్తల నుంచి హామీ తీసుకున్నారని ఆ పార్టీ నేత లోకేష్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, పెట్రోకారిడార్, కెమికల్ కారిడార్, మాన్యుఫాక్చరింగ్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ పలు కారిడార్ లను నిర్మించనున్నామని తెలిపారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి పారిశ్రామిక అభివృద్ధిని పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ రాకపోవడం, అతని కడుపు మంటకు నిదర్శనమని లోకేష్ తెలిపారు. ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.