: పోలీసులకు ఉరి సిఫారసు చేసిన సీబీఐ


ఉత్తరాఖండ్ లో ఎంబీఏ విద్యార్థిని బూటకపు ఎన్ కౌంటర్ చేసిన 17 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోరుతోంది. ఆ పోలీసులకు విధించే శిక్ష సమాజానికి మేలుకొలుపు కావాలని సీబీఐ న్యాయవాది కోర్టుకు సూచించారు. బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం కూడా ఇవ్వాలని సీబీఐ కోరింది.

ఈ కేసులో మొత్తం 18 మంది పోలీసులను నిందితులుగా పేర్కొన్న న్యాయస్థానం, ఏడుగురిని హంతకులుగా నిర్ధారించగా, పది మందిపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్ నేరాలు రుజువైనట్టు, ఒకరిపై సాక్ష్యాలు ధ్వంసం చేసిన నేరం రుజువైనట్టు న్యాయస్థానం తేల్చింది. వీరికి శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో వారందరికీ ఉరి శిక్ష విధించి సమాజానికి సందేశమివ్వాలని సీబీఐ న్యాయవాది కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News