: దోపిడీకి గురైన ఎల్ఐసీ మేనేజర్


బీహార్ లోని అరారియా జిల్లాలో ఎల్ఐసీ మేనేజర్ నుంచి ఆగంతుకులు 18.20 లక్షల రూపాయలు దోచుకున్నారు. సదర్ బజార్ లోని ఎల్ఐసీ కార్యాలయం నుంచి ఖాతాదారులు జమ చేసిన 18.20 లక్షల రూపాయలు తీసుకుని మేనేజర్ సోమ్ నాథ్ మిశ్రా ప్యూన్ తో కలిసి అదే భవనంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా నలుగురు సాయుధులు వచ్చి, తుపాకులతో బెదిరించి డబ్బుతో ఉడాయించారు. లబోదిబోమంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంఘటన ఎక్కడ జరిగిందని మేనేజర్, ప్యూన్ లను ప్రశ్నించారు. కార్యాలయం నుంచి బయటకు రాగానే ఆగంతుకులు అటకాయించారని, అనంతరం దొంగల సహచరులు వేచిచూస్తున్న ద్విచక్రవాహనాలపై ఉడాయించారని పోలీసులకు తెలిపారు. అయితే డబ్బు వస్తోందన్న సమాచారం వారికి ఎలా తెలిసింది? ద్విచక్రవాహనాల నెంబర్లు ఏమిటి? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News