: రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్న జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా సోమవారం అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. వస్తు వినియోగ సేవల పన్నుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. వచ్చే నెల ప్రారంభంలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ గురించి గురువారం వ్యవసాయ సంఘాల ప్రతినిధులతో, శుక్రవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.