: ఇక, ఇంటర్ నెట్ లేకుండానే ఫేస్ బుక్ చూడవచ్చు!
ఇక నుంచి ఎంచక్కా ఇంటర్ నెట్ లేకుండానే ఫేస్ బుక్ ను వీక్షించవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. అన్ స్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ద్వారా ఫేస్ బుక్ సేవలను అందించేందుకు యూ2 ఓషియా మొబైల్ తో బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అన్ని రకాల హ్యాండ్ సెట్లలోనూ ఈ సేవను పొందవచ్చు. ప్రస్తుతానికి కొన్ని జోన్లకు మాత్రమే పరిమితమైన ఈ సేవలను త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్లాన్ ను మూడు రోజుల పాటు వినియోగించుకుంటే రూ.4, వారం రోజులైతే రూ.10, నెల రోజులకు 20 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.