: భారత ఫుట్ బాల్ కు ఓ హీరో కావాలి: జాన్ అబ్రహాం


భారతీయ ఫుట్ బాల్ కు ఓ హీరో కావాలని సినీ నటుడు జాన్ అబ్రహాం అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏదయినా క్రీడకు ఓ మంచి క్రీడాకారుడు దొరికితే దానికి జవసత్వాలు వస్తాయని అన్నాడు. అందుకు ఉదాహరణ సానియా మీర్జా, సైనా నెహ్వాల్ అన్నాడు. వారి కంటే ముందు ప్రకాశ్ పదుకునే, టైగర్ ఉడ్స్ కూడా ఆటకు క్రేజ్ తెచ్చిపెట్టారని ఆయన అభిప్రాయపడ్డాడు.

బైచుంగ్ భాటియా అంతర్జాతీయ స్టార్ అయినప్పటికీ అంతకంటే మెరుగైన క్రీడాకారుడు కావాలని జాన్ సూచించాడు. ఫుట్ బాల్ అంటే ఆసక్తి చూపించే జాన్ అబ్రహాం, ఫుట్ బాల్ పై ఓ సినిమా తీస్తున్నాడు. అలాగే, భారతీయ ఫుట్ బాల్ లీగ్ లో ఓ జట్టును చేజిక్కించుకున్న ఫ్రాంచైజీలో పెట్టుబడులు కూడా పెట్టాడు. 2014 ఫీఫా వరల్డ్ కప్ వేడుకలు తిలకించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

  • Loading...

More Telugu News