: దేశాన్ని ఊపేసిన బదౌన్ 'హత్యాచార' ఘటనపై సిట్
దేశాన్ని ఊపేసిన బదౌన్ అత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో ఇద్దరు అక్కాచెళ్లెళ్లపై అత్యాచారం చేసి, చెట్టుకు ఉరివేసి చంపిన దారుణ ఘటనపై ఉజహాని సర్కిల్ ఆఫీసర్ ముఖేష్ సక్సేనా ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం విచారణ చేపడుతుందని ఎస్ఎస్పీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. బదౌన్ లో అత్యాచారం జరిగిన కత్రాసదత్ గంజ్ గ్రామాన్ని సందర్శించి, గ్రామస్థులతో మాట్లాడి, సిట్ అధికారులు ఫిర్యాదులు, సాక్షుల వివరాలు సేకరిస్తారని అతుల్ వెల్లడించారు.