: సత్వర న్యాయం కోసం సహకరించండి : ప్రధాని
న్యాయవ్యవస్థ పటిష్టత కోసం ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కోరారు. సత్వర న్యాయం జరగాలంటే సంస్కరణలు అవసరమన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని ఆయన ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు.
ఇవాళ న్యూఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని పలు అంశాలపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. సమావేశంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమన్ కబీర్ కూడా న్యాయవ్యవస్థలోని సమస్యల పరిష్కారంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ సదస్సుకి మన రాష్ట్ర సీఎంతోపాటు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవగా మిగిలిన రాష్ట్రాల నుంచి న్యాయశాఖ మంత్రులు హాజరయ్యారు. నాలుగేళ్ల విరామం తర్వాత న్యాయమంత్రిత్వ శాఖ ఈ సదస్సు ఏర్పాటు చేసింది.