: బాబు ఫోన్ చేశారు...జగన్ ఎత్తడం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను ఆహ్వానించేందుకు స్వయంగా టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తడం లేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ ను కూడా స్వయంగా ఆహ్వానించాలని ఫోన్ చేశారని వారు వెల్లడించారు. ప్రమాణస్వీకారోత్సవానికి జగన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై ఆ పార్టీ నేతలు స్పందించాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు తెలిపారు.