: తెలంగాణలో అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించను: చంద్రబాబు


తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేంత వరకు విశ్రమించనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ ఘనత వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఏర్పడిందని చెప్పారు. టీడీపీని నిర్వీర్యం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని... కానీ, టీడీపీ నేతలు ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై గ్రామ స్థాయి నుంచి పోరాటం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా మనుగడ సాధించలేదని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News