: జిల్లాల పునర్విభజన జరగాలి
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని జిల్లాల పునర్విభజన సాధన సమితి డిమాండ్ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఇది అత్యావశ్యకమని సమితి పేర్కొంది. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సమితి నేత మాడభూషి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించారు.