: రైతులు ఆందోళన చేస్తున్నారు... ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి: జానారెడ్డి
రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కాలపరిమితి విధించడం పట్ల టి.సీఎల్పీ నేత జానారెడ్డి పెదవి విరిచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాలపరిమితితో సంబంధం లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారని అన్నారు. హామీలను అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పారు.