: బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఛైర్మన్
నమస్తే తెలంగాణ దినపత్రిక ఛైర్మన్ సీఎల్.రాజం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ ద్వారా దేశానికి సేవ చేస్తానని ఈ సందర్భంగా రాజం తెలిపారు. ప్రధాని మోడీ స్పూర్తితోనే తాను బీజేపీలో చేరినట్టు చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా మోడీకి ఉందని అన్నారు.