: తిరుపతికి బయల్దేరిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతికి బయల్దేరి వెళ్లారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరారు. తిరుపతిలో ఇవాళ రాత్రి 7 గంటలకు జరిగే టీడీఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించనున్నారు. రాత్రి 8.51 గంటలకు టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరును ప్రకటిస్తారు. ఈ నెల 8వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.