: నన్నపనేని రాజకుమారికి అస్వస్థత


టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలో ఇవాళ సాయంత్రం జరిగే టీడీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె తిరుపతికి వచ్చారు. హోటల్ గదిలోకి వచ్చిన కొద్దిసేపటికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం నన్నపనేని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పరిస్థితిని బట్టి ఆమెను డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు.

  • Loading...

More Telugu News