: కనకదుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించాడు. పైడిరాజు అనే క్షురకుడు రూ.5 వేలు దొంగిలిస్తున్న దృశ్యం సీసీ కెమెరా కంటికి చిక్కింది. ఆలయ అధికారులు సీసీ కెమెరా పుటేజ్ ను పరిశీలిస్తుండగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆలయ ఉన్నతాధికారులు అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.