: ఆర్ఎస్ఎస్ చీఫ్ కు తృటిలో తప్పిన ప్రమాదం


ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోకి ఓ టాటా సుమో అకస్మాత్తుగా వచ్చి ఓ కారును ఢీ కొట్టింది. అయితే భగవత్ కు ఎటువంటి గాయాలు కాలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. టాటా సుమో హర్యనా రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News