: పంట రుణాలపై హామీ ఇచ్చాం...గోల్డ్ లోన్స్ పై హామీ ఇవ్వలేదు: ఈటెల
ఇచ్చిన మాటకు కట్టుబడి పంట రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సీఎం కేసీఆర్ తో కలిసి బ్యాంకు అధికారులతో సమావేశమైన అనంతరం హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతు రుణాల్లో పంట రుణాలపై హామీ ఇచ్చామన్నారు. బంగారం మీద రుణాలపై హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. బంగారంపై రుణాలు పంట రుణాల కిందకు రావని ఈటెల స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా బ్యాంకులు రుణాల వివరాలు అందజేస్తాయని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై పడే పంట రుణ భారం సుమారు 12 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన వెల్లడించారు.