: డ్యూటీకి డుమ్మా కొట్టి... మద్యం తాగి, తూగిన పే అండ్ అకౌంట్స్ సిబ్బంది


వారు విధి నిర్వహణ చేస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన, బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, డ్యూటీకి డుమ్మా కొట్టి మరీ పీకల దాకా మద్యం తాగి, తూగారు... నోటికొచ్చినట్టు వాగారు. ఖమ్మం జిల్లాలోని పే అండ్ అకౌంట్స్ సిబ్బంది నిర్వాకమిది. ఇవాళ ఉదయం ఆఫీసుకెళ్లిన 30 మంది సిబ్బంది రిజిస్టర్ లో సంతకం చేసి, నేరుగా ప్రైవేట్ హోటల్ కి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసమని అక్కడకు వెళ్లారు. మద్యం తాగే తీరును చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దాడికి దిగారు. "మా ఇష్టమొచ్చినట్టు చేస్తాం.. మీకు చేతనైన పని చేసుకోండి" అంటూ బెదిరించారు. ఈ వ్యవహారంపై సూపరింటెండెంట్ ను వివరణ కోరగా తన అనుమతిలోనే పార్టీకి వెళ్లారని సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News