: ఎయిర్ ఏషియా బాటలో స్పైస్ జెట్...విమాన ప్రయాణం చవక


విమాన ప్రయాణం చవకగా మారింది. మొన్న ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ప్రారంభ ఆఫర్ గా బెంగళూరు, గోవా ప్రయాణ టికెట్లు కేవలం 339 రూపాయలకే విక్రయించి ప్రయాణికులను ఆకట్టుకోగా, తాజాగా స్పైస్ జెట్ మరో ఆఫర్ ప్రకటించింది. స్వదేశీ ప్రయాణాలను కేవలం 2,999 రూపాయలకే అందిస్తామని ప్రకటించింది. అయితే టికెట్ల విక్రయం కేవలం మంగళ, బుధ, గురు వారాల్లో జరుగుతుందని, ఆ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకుంటే 2014 జూలై 6 నుంచి 2015 మార్చి 28వ తేదీ లోపు స్పైస్ జెట్ విమానాల్లో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ఆ సంస్థ చెబుతోంది.

నేరుగా వెళ్లే ప్రయాణాలతో పాటు, ఎక్కడైనా ఒక ఎయిర్ పోర్టులో ఆగి, మళ్లీ వెళ్లే ప్రయాణాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్ జెట్ తెలిపింది. ద్వితీయ శ్రేణి నగరాల ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్ మొదలు పెట్టినట్టు స్పైస్ జెట్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News