: ప్రజల ఆశలు, కలల సాకారం కోసం పనిచేస్తాం: మోడీ
ఈ ప్రజాస్వామ్య ఆలయం (పార్లమెంటు)లో ప్రజల ఆశలు, కోర్కెలు, కలల సాకారం కోసం పనిచేస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రొటెం స్పీకర్ గా కమల్ నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. అనంతరం పార్లమెంటు భవన్ కు చేరుకున్నారు. లోపలికి ప్రవేశించే ముందు బయట వేచి ఉన్న విలేకరులతో మోడీ మాట్లాడుతూ... తమను ఎన్నుకుని, దీవించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.