: ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన సబిత
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ కృపానందం ఈ రోజు హాజరయ్యారు. ఈ కేసులో తుది చార్జ్ షీటులో సబిత, కృపానందంను సీబీఐ నిందితులుగా పేర్కొంది. దీంతో వారు కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను జడ్జి ఈ నెల 16కు వాయిదా వేశారు.