: ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సానియా జోడీ అవుట్
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత్ కథ కంచికి చేరింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీకి క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. సానియా మీర్జా (భారత్), కారా బ్లాంక్ (జింబాబ్వే) జోడీ 2-6, 6-3, 3-6 తేడాతో సు వే షా (చైనీస్ తైపీ), షూయ్ పెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.