: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావారణ శాఖాధికారులు తెలిపారు. పాడేరు, పుంగనూరుల్లో అత్యధికంగా 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే అనంతపురం జిల్లా గుత్తి, తాడిపత్రిలో 6 సెం.మీ చొప్పున, అనంతపురం, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు, కందుకూరు, కదిరి లలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం, చింతపల్లి లలో 3.5 సెం.మీ చొప్పున వర్షం కురిసినట్లు వాతావారణ శాఖ వెల్లడించింది.