: ఓ వైపు వర్షాలు, మరోవైపు వడగాలులు


వచ్చే 24 గంటల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇవాళ సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి, వీటి ప్రభావంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖాధికారులు తెలిపారు.

రాగల 48 గంటల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News