: బుధవారం సాయంత్రం టీడీపీ శాసనసభాపక్ష భేటీ
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష భేటీ రేపు (బుధవారం) సాయంత్రం తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకొంటారు. ఈ భేటీ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు పర్యవేక్షిస్తున్నారు.