: గంభీరే బెస్ట్ కెప్టెన్: వసీం అక్రమ్
ఐపీఎల్ టైటిల్ ను రెండోసారి ఎగరేసుకుపోయిన కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్, కోల్ కతా బౌలింగ్ కోచ్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తనకు ఉన్న వనరులను సమర్థవంతగా ఉపయోగించుకుని గంభీర్ అద్భుత ఫలితాలను సాధించాడని ప్రశంసించాడు. ఈ టోర్నీలో అన్ని జట్ల కెప్టెన్ల కంటే గంభీర్ గొప్ప పనితీరును కనబరిచాడని చెప్పాడు. జట్టును ముందుండి నడిపించడంలో సఫలీకృతం అయ్యాడని... అందుకే అందరు కెప్టెన్లలోకి గంభీరే బెస్ట్ అని అక్రం తెలిపాడు.