: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు : చిరంజీవి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా మెలగాలని అన్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి తనను ఆహ్వానించారని ఆయన తెలిపారు. కేటీఆర్ తో రెండు రోజుల క్రితమే మాట్లాడానని చిరు వెల్లడించారు. ప్రభుత్వంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలుస్తామని ఈ సందర్భంగా చిరంజీవి స్పష్టం చేశారు.