: కర్నూలు ఘాట్ రోడ్డుపై పెనుగాలుల బీభత్సం
కర్నూలు జిల్లాలో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలుల తీవ్రతకు నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్డుకి ఇరువైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.