: పోటెత్తిన పొలార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ చెలరేగిపోయాడు. ఆరోస్థానంలో వచ్చిన పొలార్డ్ కేవలం 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కార్తీక్ 37 పరుగులు చేయగా, హర్భజన్ సింగ్ 21 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. పొలార్డ్ హాఫ్ సెంచరీతో రాణించబట్టే ముంబయికి ఈ స్కోరైనా దక్కింది. చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించారు. బ్రావో రెండు వికెట్లు తీశాడు.