: మోడీని కలుసుకున్న ఒడిశా సీఎం నవీన్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలుసుకున్నారు. ఒడిశాకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నవీన్ వెంట బీజేడీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. అనంతరం నవీన్ పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చేరే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. ఒడిశాకు ప్రత్యేక హోదాతోపాటు, ఖనిజాల్లో రాష్ట్రాలకు చెల్లింపుల అంశాలపై ప్రధానితో మాట్లాడినట్లు చెప్పారు.