: మురికివాడలు లేని నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతా: కేసీఆర్
తెలంగాణ మేధావులతో రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయానికి మేలు చేసే చర్యలను చేపడతామని అన్నారు. దేశానికి తెలంగాణ విత్తన భాండాగారంగా నిలుస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పోలీసు శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తామన్నారు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచానికి చాటుతామని ఆయన చెప్పారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతామని కేసీఆర్ అన్నారు. 10 వేల సీసీ కెమెరాలతో హైదరాబాదులో పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేస్తామని ఆయన ప్రకటించారు.