: ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు మొండిచేయి
కేసీఆర్ తన మంత్రివర్గంలో రెండు జిల్లాలకు మొండిచేయి చూపారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరికి కూడా తొలిసారి చాన్స్ దక్కలేదు. అలాగే, ఖమ్మం జిల్లా నుంచి ఒకే ఒక్కడు జలగం వెంకట్రావ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు కూడా చోటు లభించలేదు. విస్తరణలో అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.