: ఫుట్ బాల్ దిగ్గజం పీలే కుమారుడికి 33 ఏళ్ల శిక్ష
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు, ఆల్ టైం గ్రేట్ పీలే కుమారుడు ఎడిన్హో (43)కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేసే వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలను నడిపిన కేసులో బ్రెజిల్ కోర్టు ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది. ఎడిన్హోతో పాటు మరో ముగ్గురికి కూడా ఇదే శిక్ష పడింది. వీరి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. రొనాల్డో నాదిన్హోకు చెందిన ముఠా దగ్గర మాదక ద్రవ్యాలు కొన్నానని... అయితే వారితో కలసి పనిచేయలేదని ఎడిన్హో వాదించినప్పటికీ కోర్టు కనికరం చూపలేదు.