: రామ్ చరణ్ 'తుఫాన్'కు తొలగిన అడ్డంకి


రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం జంజీర్ (తెలుగులో తుఫాన్)కు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమాపై తమకూ హక్కు ఉంది కాబట్టి, కొంత మొత్తాన్ని తమకు ఇవ్వాలంటూ చిత్ర నిర్మాత అమిత్ మెహ్రా సోదరులు ఆమధ్య బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ప్రసారాన్ని వెంటనే ఆపేయాలని ఆదేశించిన కోర్టు సమక్షంలోనే ఈ సమస్య ఇప్పుడు పరిష్కారమయ్యింది. తన సోదరులకు కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు అమిత్ మెహ్రా ఒప్పుకోవడంతో సినిమా విడుదలపై ఉన్న అభ్యంతరాన్ని కోర్టు రద్దు చేసింది. అయితే ఒప్పుకున్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన తరువాతే సినిమాను విడుదల చేసుకోవాలని బాంబే హైకోర్టు అమిత్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News