: జూన్ 2న నేను, కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తాం: గవర్నర్ నరసింహన్
జూన్ 2న తెలంగాణ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తానని గవర్నర్ నరసింహన్ తెలిపారు. రాజ్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, ముందుగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానని, అనంతరం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జూన్ 2తో తెలంగాణలో రాష్ట్రపతి పాలన ముగుస్తుందని తెలిపారు. రెండు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించానని, చివరి రెండేళ్లు రాష్ట్రాన్ని కష్టాలు చుట్టుముట్టాయని ఆయన అన్నారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.