: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం: వైకాపా ఎమ్మెల్యే పాయం
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని... తమ అధినేత జగన్ నేతృత్వంలోనే పనిచేస్తానని ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు జరిగిన వైకాపా శాసనసభా పక్ష సమావేశానికి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో వైకాపాను బలోపేతం చేస్తామని అన్నారు.