: తెలంగాణపై సోనియాకు ఎమ్మెల్యేల లేఖ


ప్రత్యేక రాష్ట్రాన్నివెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాయాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకటరమణ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన చెప్పారు. అయితే, తెలంగాణపై మరికొంత సమయం కావాలని అధిష్ఠానం అడిగినప్పుడు తమకు కొంత నిరాశ కలిగిందన్నారు. త్వరలో తెలంగాణ మంత్రులతో సమావేశమై తెలంగాణపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News