: జార్ఖండ్ లో పెను గాలులకు ఏడుగురు మృతి


జార్ఖండ్ రాష్ట్ర వాసులను ఈ తెల్లవారుజామున పెను గాలులతో కూడిన వర్షం ఓ కుదుపు కుదిపింది. పెనుగాలుల ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాంచి, జంషెడ్ పూర్, హజారీబాగ్, లతేహర్ తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. చాత్రా జిల్లాలోని కోనా గ్రామంలో చెట్టుకింద నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ధన్ బాద్ జిల్లా బాగ్ తండ్ లో పిడుగుపడి ముగ్గురు మరణించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News