: సినీ దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు విశాఖ జిల్లా యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే... జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' చిత్రం కథా రచన కోసం నిర్మాత చెంగల వెంకట్రావ్ వద్ద నుంచి విజయేంద్ర ప్రసాద్ రూ. 30 లక్షలు తీసుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయమని వెంకట్రావ్ కోరారు. దాంతో విజయేంద్ర చెక్ ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఈరోజు కోర్టు వారెంట్ జారీ చేసింది.