: సచివాలయ భవనాలు రెండు రాష్ట్రాలకు కేటాయింపు
హైదరాబాదు సచివాలయంలోని భవనాలను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏ, బీ, సీ, డీ బ్లాక్ లను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించారు. సీ బ్లాక్ ఆరో అంతస్తులో తెలంగాణ సీఎం ఛాంబర్; మూడో అంతస్తులో తెలంగాణ సీఎస్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. సౌత్ హెచ్, నార్త్ హెచ్, కే, జే, ఎల్ బ్లాక్ లను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఎల్ బ్లాక్ 8వ అంతస్తులో ఆంధ్రప్రదేశ్ సీఎం ఛాంబర్, 7వ అంతస్తులో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఛాంబర్ ఏర్పాటు చేశారు.