: ఇష్టమొచ్చినట్టు పేరు మారిస్తే ఊరుకోం: వీహెచ్
హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరును ఇష్టమొచ్చినట్టు మారిస్తే ఊరుకోమని కాంగ్రెస్ సీినియర్ నేత వి.హనుమంతరావు హెచ్చరించారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అనడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. కావాలంటే, ఏపీలో ఉన్న ఎయిర్ పోర్టులకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని... ఇక్కడ రాజీవ్ గాంధీ పేరు మారిస్తే మాత్రం ఊరుకోమన్నారు. చంద్రబాబు ప్రకటనలకు వెంకయ్య నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.