: యూపీలో రాష్ట్రపతి పాలనకు మాయావతి డిమాండ్
ఉత్తరప్రదేశ్ లో నేరాలు పెరిగిపోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేశ్ యాదవ్ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారాలు, అల్లర్లతో యూపీ జంగిల్ రాజ్ గా మారిపోయిందన్నారు. బాదౌన్ లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం చేసి ఉరేసిన ఘటనపై సీబీఐ విచారణకు ఆమె డిమాండ్ చేశారు.