: పోలవరానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వారిపై తేనెటీగల దాడి
పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా వీఆర్ పురంలో రిలే దీక్షను చేపట్టారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో... ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడ్డాయి. దొరికిన వారిని దొరికినట్టు కుట్టడం మొదలుపెట్టాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆందోళనకారులు అక్కడ నుంచి పరుగులు పెట్టారు. క్షణాల వ్యవధిలో దీక్షాస్థలి ఖాళీ అయిపోయింది. తేనెటీగల దాడిలో పది మందికి పైగా గాయాలపాలయ్యారు.