: ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు... రోజల్లా అక్కడ బిజీ బిజీ!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఆయన భేటీ అవుతారు. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 11 గంటలకు జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, 12.30 గంటలకు ప్రణాళిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, మధ్యాహ్నం 2 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, 3.00 గంటలకు ఆర్ధిక సంఘం సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి లతో సమావేశమవుతారు. ఇక సాయంత్రం 6 గంటలకు విద్యుత్ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి పెండింగులో ఉన్న కీలకమైన అంశాలను వారితో చంద్రబాబు చర్చిస్తారు.