: జూన్ 8న రాత్రి 7.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జూన్ 8న రాత్రి 7.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే వేదికపై రాత్రి 8.35 గంటలకు రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై తొలి సంతకం చేస్తారు. గుంటూరు, విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా యువగర్జన సభను నిర్వహించిన మైదానంలో ఈ ప్రమాణస్వీకార వేడుక జరగనుంది. తొలుత ఆరోజు ఉదయం 11.45 గంటలకు ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించినా, ఎండ వేడిమి దృష్ట్యా సమయాన్ని మార్చినట్టు సమాచారం. మరోవైపు జూన్ 4వ తేదీన తిరుపతిలో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారు.